కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కోసం డిమాండ్ చేస్తూ ఆగస్టు 29,30,31 తేదీల్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర (CPM Padayatra) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. వలిగొండ మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శిలు, ప్రజా సంఘాల మండల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం పాదయాత్ర ఆగస్ట్ 29న భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై 31న ఇందిరా పార్క్ కు చేరుకుంటుందన్నారు. అదే రోజు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 31న జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నాను వేలాదిగా రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జహంగీర్ మాట్లాడుతూ.. భువనగిరి జిల్లా నూతనంగా ఏర్పడి దశాబ్దం అవుతున్నప్పటికీ జిల్లాలో ఎంతవరకు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పురోగతి సాధించ లేదన్నారు. జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండి లక్షలాది మంది చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం ఆధారపడి తమ కుటుంబాలను గడుపుతున్నారన్నారు ఇక్కడి ప్రజలకు గత్యంతరం లేక విషాన్ని వెదజల్లుతున్న మూసీపై ఆధారపడి అనేక రోగాలకు గురవుతున్నారని ప్రజల గోడును ప్రజల ఆరోగ్యాలను పట్టించుకునే పరిస్థితిలో లేని పాలకులు తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశలో కందడి సత్తిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, మండల కమిటీ సభ్యులు మొగిలిపాక గోపాల్, చీర్క శ్రీశైలం రెడ్డి,కర్ణకంటి యాదయ్య,దుబ్బ లింగం, భీమనబోయిన జంగయ్య పాల్గొన్నారు.

