కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి పొంగులేటిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కంపెనీ అవినీతికి పాల్పడింది అని అందరికీ అర్థం అయింది. ప్రభుత్వాన్ని కవర్ చేయడానికి, ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తున్నారని, సమాధానం లేకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వంలో అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తుండటంతో ఆయన్ని బెదిరిస్తున్నారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఎథిక్స్ కమిటీ ముందు నిలబెట్టాలి. మంత్రి తప్పు చేశారని అందరికీ అర్థం అయింది. మైనింగ్‌లో అవినీతిపై సీబీ సీఐడి కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదు.. అందుకే మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలని తెలిపారు. మంత్రికి 28 లక్షల పెనాల్టీ వేశారు. కానీ ఆ పెనాల్టీ కట్టలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారు.
నా తమ్ముని పేరు, నా బావమరిది పేరు బయటకు తీసి విచారణ చేస్తామని అంటున్నారు. నేను కూడా రెడీగా ఉన్నాను. నీ తమ్ముడు TDRలో చేసిన కుంభకోణంతో పాటు మా తమ్ముడుపై హౌజ్ కమిటీ వేయండి. సిట్టింగ్ జడ్జి చేత విచారణకు మేము సిద్ధంగా ఉన్నాము.. మీరు సిద్దంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. 20 అంశాలపై విచారణ చేయించాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చాం. వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మైక్ కోసం నాలుగున్నర గంటల పాటు నిలబడినా మైక్ ఇవ్వలేదు. పొంగులేటి పై హౌస్ కమిటీ వేసే ధైర్యం మీకు లేదు. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ ఉంటుందని హరీశ్ (Harish Rao) తెలిపారు.
Read Also: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె కథ నడిపింది..!
Follow Us On: Instagram

