కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ (West Bengal) ఎన్నికల్లో ప్రచారం ఊపందుకున్నది. బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్రఘర్షణ చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి వస్తే చేపలు, మాంసం నిషేధిస్తారంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు తినరంటూ చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలు మాంసం, గుడ్లు తినలేరని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. అందుకే బెంగాల్‌లో నిత్యం గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజనులు, మహిళల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ (Mamata Banerjee) గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం ఈ రాష్ట్రంలో పవర్‌లోకి రావాలని చూస్తోంది. దీంతో ఇరువర్గాలు మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతోంది.
Read Also: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Follow Us On : WhatsApp

