నిధుల కోసం సీఎం చుట్టూ తిరగాలా.. రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కలం, నల్లగొండ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇయ్యట్లేదని, మంత్రులకు మాత్రమే నిధులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల నియోజకవర్గానికి మాత్రమే బిల్లులు వస్తున్నాయని, ఎమ్మెల్యే నియోజకవర్గంలో బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అవుతుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం.. ఇదేం ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. నిధుల కోసం మంత్రులు, సీఎం (CM Revanth Reddy) చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ విన్పిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మేం పోరాటం చేశామని, తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదురించామన్నారు. సీఎం రేవంత్ కొడంగల్‌‌ను (Kodangal) అభివృద్ధి చేసుకున్నట్లు.. నాకు నా నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవాలని ఉండదా? రాజగోపాల్ రెడ్డి అని ప్రశ్నించారు.

రెండున్నరేండ్లుగా మనోవేదనతో రగిలిపోతున్నానని, ఇప్పుడు అవకాశం రావడంతో మాట్లాడుతున్నానని తెలిపారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగిల్ టీచర్ స్కూల్స్‌ను ప్రీ స్కూల్స్‌గా మార్చాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్లుగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని, ప్రైవేటు పాఠశాలలు తక్కువ.. స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని తెలిపారు. లోపం ఎక్కడ ఉందో ప్రభుత్వం ఆలోచించాలని, ప్రభుత్వ హాస్టల్స్‌లో మౌలిక వసతుల సమస్య ఉందని రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) చెప్పారు.

Read Also: ఆలోచింపజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>