మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె కథ నడిపింది..!

కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case)లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫామ్‌ హౌస్ వాచ్‌మెన్ భార్య ద్వారా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గోవాకు చెందిన డీజే క్లింటన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు సిట్ తేల్చింది. ఈ మేరకు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసైనట్లు.. ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పబ్బుల్లో వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిక్కర్, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు నిర్వహించినట్లు సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయర్లతో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకులు ఉన్నట్లు గుర్తించింది.

ఇందులో భాగంగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి వాచ్ మెన్ భార్యకు క్లింటన్ ఇచ్చాడని.. ఆ తర్వాత వాచ్ మెన్ భార్య ఈ డ్రగ్స్ని రోహిత్ రెడ్డికి (Rohith Reddy) ఇచ్చిందని సిట్ అధికారులు గుర్తించారు. గత రెండు నెలల వ్యవధిలో మూడు వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు జరిగినట్లు.. పొలిటికల్, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే పార్టీలో పట్టుబడిన ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త నమిత్ శర్మ, అలాగే రోహిత్ రెడ్డి వ్యాపారాలపై సిట్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టింది. నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ ఏ వ్యాపారాలు చేస్తారు, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి చేస్తున్న దందాలేంటి అనే విషయాలను తేల్చే పనిలో సిట్ ఉంది. కొంతకాలంగా ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై, వీకెండ్ పార్టీలకు హాజరయ్యే హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులు, రోహిత్ రెడ్డి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌పై సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also: క్షమించండి.. ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంది: కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>