వడదెబ్బ నుంచి రక్షణ కావాలా..? తప్పక పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు

కలం, వెబ్‌డెస్క్: ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు ఎండలు మండి పోతుండటంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. కానీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలీ పని చేసుకునే వారు బయటికి వెళ్లక తప్పదు. ఇలా రోజువారీ పనుల నిమిత్తం బయటికి వెళ్లేవారు తమ బాడీని కూల్‌గా ఉంచుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు (Summer Tips) తీసుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం. నిపుణుల సూచనల ప్రకారం..

ఎండలోకి వెళ్లేముందు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనులు ఇవే!
  • వేసవికాలంలో తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. బయటకు వెళ్లే కనీసం 15-20 నిమిషాల ముందు 1 నుండి 2 గ్లాసుల నీరు త్రాగాలట.
  • ఈ వేసవి సీజన్ లో ఉదయం పూట మీరు ఏదైనా భారీగా తినవలసి వస్తే, నూనె , మసాలాలు లేని తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పంటా భాత్ (సద్ది అన్నం)ఒక గొప్ప సాంప్రదాయ ఆహారం. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఓ గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టి పులిసిన తర్వాత తెల్లవారే తింటే శరీరాన్ని చల్లగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.
  • మీరు బయటకు వెళ్లినప్పుడు కొద్దిగా ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం లేదా ఒక గ్లాసు చల్లని పుల్లటి పెరుగు తాగడం వల్ల ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది.
  • పండ్లలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు కొన్ని పుచ్చకాయ ముక్కలు లేదా ఒక దోసకాయ తినడం వల్ల శరీరం చాలా సేపటి వరకు తేమగా ఉంటుంది.
ఇంటికి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు

ఎండలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకుంటే శరీరం అలసట తీరుతుందనే విషయం చాలా మందికి తెలియదు. మీరు బాగా పండిన బొప్పాయి లేదా అరటిపండు తినవచ్చు. ఎందుకంటే అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది వేడిలో చెమట ద్వారా శరీరం నుండి విడుదలయ్యే పొటాషియం లోపాన్ని భర్తీ చేసి, శక్తిని అందిస్తుంది.

అంతేకాకుండా సహజ ఎలక్ట్రోలైట్‌లకు ఉత్తమ మూలం పప్పు నీరు. పప్పు నీరు (Dal Water) అనేది సహజ ఎలక్ట్రోలైట్‌లకు, పోషకాలకు ఒక అద్భుతమైన, తక్కువ ఖర్చుతో కూడిన దేశీ మూలం. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా నీరసంగా ఉన్నప్పుడు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి ఇది ఒక సంప్రదాయ రక్షణ కవచంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. అంతే కాకుండా ఎండ నుండి వచ్చిన తర్వాత, మీరు కాసేపు కూర్చుని కొబ్బరి నీరు త్రాగవచ్చు. ఇది శరీరం నుండి విడుదలయ్యే ఖనిజ లవణాలను త్వరగా భర్తీ చేస్తుంది.

చేయకూడని తప్పులు..

చాలా మంది ఎండలో వెళ్లినప్పుడు వారి దాహాన్ని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇది అస్సలు చేయకూడని తప్పు. ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండి ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగకపోవడమే మంచిది. అవి తాత్కాలికంగా మీ దాహాన్ని తీర్చినప్పటికీ, శరీరంలోని నీటి సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతే కాకుండా టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కాబట్టి ఎండలో తిరిగేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవి తాపం, వడదెబ్బ నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>