కలం, జనగామ: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు చేపట్టకపోవడంతోపాటు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లి సమీపంలోని కోమల్ల, గోవర్ధన గిరి గ్రామాల మధ్య సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు. కోమల్ల గ్రామనికి చెందిన హలవత్ బాలాజీ (48), కొడుకు నరేశ్ (25)తో కలిసి బైక్‌పై రఘునాథపల్లికి వెళ్తున్నారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన నరేశ్‌ను వరంగల్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

