రైతు సభను విజయవంతం చేయండి: ఎర్రబెల్లి దయాకర్ రావు

కలం, వరంగల్ బ్యూరో: ఈ నెల 6న వరంగల్ (Warangal) నగరంలో నిర్వహించబోయే రైతు సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్‌లో శనివారం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. రైతు నోట్లో మన్ను కొట్టాలని చూస్తోందని, కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు భారీ రైతు సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, రైతులు, పార్టీ శ్రేణులు స్వచ్చందంగా తరలిరావాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>