కలం, సినిమా: రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో RC17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ 1న ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అనస్వర రాజన్, అనీత్ పడ్డా, రష్మిక పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతుండగానే ఎవరూ ఊహించని విధంగా సుకుమార్ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందంటూ మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఆకాశంలో ఒక తార సినిమాతో తెలుగు తెరకు పరిచమైన అచ్చ తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) చరణ్‌కు జోడీగా నటించనుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఈమె పేరు బలంగా వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ చరణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అతి త్వరలో ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నదానిపై క్లారిటీ రానుంది.

