Mobile Popup Ad
Mobile Popup Ad

సర్కార్ భూమిని కబ్జా చేసిన సర్పంచ్ భర్త!

కలం, కరీంనగర్ బ్యూరో (జగిత్యాల) : జగిత్యాల (Jagtial) జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఏళ్ల తరబడి అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై గ్రామానికి చెందిన సల్లూరి తిరుపతి జిల్లా కలెక్టర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం.. చిన్నాపూర్ సర్వే నంబర్ 23, 70లోని సుమారు 5 ఎకరాల ఖరీదైన సర్కార్ భూమిని సర్పంచ్ భర్త గట్టు గంగారాం, ఆయన సోదరుడు గట్టు గంగాధర్ అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం లేకుండా, తహసీల్దార్ ను తప్పుదోవ పట్టించి ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకుని గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి హక్కులు లేకుండా ఆక్రమించి పంటలు వేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.

కబ్జాకు గురైన భూమిని తక్షణమే స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాల కోసం వాడాలని తిరుపతి డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి స్థలం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇక్కడి భూమిని వాడుకోవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు యువత కోసం క్రీడా ప్రాంగణం నిర్మాణం చేపట్టాలని కోరారు. బుగ్గారం మండలంక సంబంధించిన పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కోసం ఈ భూమిని ఇప్పించాలని తిరుపతి కలెక్టర్ ను వినతిపత్రంలో కోరారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే కబ్జా దారులు చెలరేగిపోతున్నారని, వెంటనే విచారణ జరిపి అక్రమ హక్కులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, ఈ ఫిర్యాదు బుగ్గారం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>