Mobile Popup Ad
Mobile Popup Ad

డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డిని (DSP Bheem Reddy) తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసింది. మరికాసేపట్లో ఆయన్ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచబోతున్నారు.. ఇటీవలే ఆయన నివాసంతో మరో 16 ప్రాంతాల్లో మూకుమ్మడి సోదాలు చేపట్టిన ఏసీబీ.. సుమారు రూ.300 కోట్ల అక్రమాస్తులు గుర్తించింది.

ఆయన్ను అరెస్ట్ చేస్తున్న క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో తొలుత ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి పంపించేయడం, విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలిస్తున్నారు.

ఎలా వచ్చాయి ఇన్ని ఆస్తులు..?

పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన భీమ్ రెడ్డి (DSP Bheem Reddy) సర్వీస్ పరీక్ష రాసి ఎస్సై అయ్యారు. అనంతరం, పదోన్నతుల ద్వారా డీఎస్పీ వరకు చేరుకుని, ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పని చేస్తున్నారు. మామూలు డీఎస్పీ స్థాయి అధికారికి ఇన్ని ఆస్తులు ఉండటం వెనుక అసలు కారణాలను ఏసీబీ కూపీ లాగుతోంది. మరోవైపు ఈ ఆస్తుల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని ఈడీ అనుమానించి.. కేసు వివరాలను కూడా తెప్పించుకుని పరిశీలిస్తోంది.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>