Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంను కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం మెదక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. దుబ్బాకకు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ మంజూరు చేయాలని కోరారు. హబ్సిపూర్ నుంచి దుబ్బాక వరకు ఉన్న డబుల్ రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో నిర్మించనున్న ఆధునిక నాన్‌వెజ్ మార్కెట్ కోసం గతంలో మంజూరైన నిధులను తిరిగి విడుదల చేయాలని సీఎంను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు.

దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే (Kotha Prabhakar Reddy) వినతులను పరిశీలించిన సీఎం.. పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Read Also: తెలంగాణ టీ20లో మెరిసిన నిర్మల్ యువ క్రికెటర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>