కలం మెదక్ బ్యూరో: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ (ACB) కి చిక్కిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. నర్సాపూర్ (Narsapur) లోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు జరిపింది.
ఈ దాడులలో నర్సాపూర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ రమణారెడ్డి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బిల్లు చెల్లింపుల కోసం ఓ కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశాడు రమణారెడ్డి. ఈ క్రమంలో ఆయన డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. నర్సాపూర్ ADE కార్యాలయంలో ACB DSP సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.
Read Also: కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు! … ప్రధాని ఏమన్నారంటే?
Follow Us On: Instagram

