Mobile Popup Ad
Mobile Popup Ad

పెళ్లి రూమ‌ర్ల వేళ జంటగా క‌నిపించిన టాలీవుడ్ సెలబ్రెటీలు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఒక‌ప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రైనా ఇద్ద‌రు సెల‌బ్రెటీల‌కు ల‌వ్‌, పెళ్లి రూమ‌ర్లు (Celebrity Rumors) వ‌స్తే ఆ ఇద్ద‌రూ కాస్త దూరం మెయింటైన్ చేసే వారు. కానీ ఇప్పుడు ఆ రూమ‌ర్లకు బ‌లం చేకూరుస్తూ ద‌ర్జాగా ఇద్ద‌రూ క‌లిసే జ‌నం ముందుకొస్తున్నారు. బంధాన్ని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌క‌ముందే నెటిజ‌న్ల‌కు హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌, త్రిష ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించారు. కొన్నేళ్లుగా వీరిద్ద‌రి రిలేష‌న్‌షిప్‌పై రూమ‌ర్లు వ‌స్తుండ‌గా ఇటీవ‌ల విజ‌య్ భార్య విడాకుల‌కు అప్లై చేయ‌డంతో ఆ రూమ‌ర్లకు మ‌రింత బ‌లం చేకూరింది. ఈ త‌రుణంలోనే విజ‌య్ త్రిష‌తో క‌లిసి ఓ వివాహ వేడుక‌కు హాజ‌ర‌వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇక టాలీవుడ్‌లో మ‌రో జంట పెళ్లిపై ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి కొడుకు కాల‌భైర‌వ‌ (Kaala Bhairava), యంగ్ హీరోయిన్ కావ్య క‌ల్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) ప్రేమ‌లో ఉన్నార‌ని, ఈ ఇయ‌ర్‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కొంద‌రు మాత్రం ఇద్ద‌రికీ ఏజ్ గ్యాప్ ఉంద‌ని, అస‌లు వీళ్ల‌కు ప‌రిచ‌య‌మే లేద‌ని, ఆ రూమ‌ర్లు అబ‌ద్ద‌మంటూ కొట్టిపారేశారు. కానీ, తాజాగా ఈ జోడీ ఒకేచోట కెమెరాకు చిక్కారు. ఓ పుస్తకావిష్క‌ర‌ణ‌కు కావ్య‌ కాల‌భైర‌వ‌తో క‌లిసి హాజ‌రైంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక వీరి పెళ్లి ఖాయ‌మ‌ని, అధికారికంగా అనౌన్స్ చేయ‌డ‌మే త‌రువాయి అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

Read Also: నవరాత్రి వేళ సుందరకాండ పఠనంతో శుభఫలితాలు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>