కలం, నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ (Nagarjuna Sagar)ను శనివారం మున్సిపల్ నల్లగొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు, తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ జి. రమేశ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. సాగర్ సందర్శనలో భాగంగా టూరిజం లాంచీలో నాగర్జున కొండ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి, కుటుంబ సభ్యులతో తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత బుద్ధవనంలో పర్యటించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జున కొండ మ్యూజియం, బుద్ధవనం విశేషాలను ఎలక్షన్ అబ్జర్వర్ రమేశ్ (Ramesh)కు వివరించారు. ఆయన వెంట పెద్దవూర విద్యాశాఖ అధికారి తరి రాము, దండ శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.
Read Also: MPTC, ZPTC ఎన్నికలపై సీఎం కీలక చర్చ
Follow Us On: Instagram


