కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ (Attapur) లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ విభేదాల కారణంగా ఓ న్యాయవాదిని దుండగులు విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత్య (Lawyer Murder) చేశారు. సులేమాన్ నగర్ లోని తన ఆఫీసులో ఉన్న సమయంలో న్యాయవాది ఖదీర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. కత్తులతో దాడిచేయగా తీవ్ర గాయాలపాలయిన న్యాయవాది అక్కడికక్కడే మృతిచెందాడు. ఖదీర్ ఊపిరిపోయిందో లేదో అని నిర్దారించుకున్న తరువాతే నిందితులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ విభేదాల కారణంగానే ఖదీర్ ను తన బావమరుదులే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: సాయం చేయమంటే.. రూ.4.5 లక్షలు దోచేశారు
Follow Us On: Sharechat


