Mobile Popup Ad
Mobile Popup Ad

చేతిలో పత్రాలు.. కళ్లలో నీళ్లు.. భూమి కోసం 85 ఏళ్ల వృద్ధుడి పోరాటం!

కలం, మెదక్ బ్యూరో: తనకు న్యాయం చేయాలంటూ 85 సంవత్సరాల వృద్ధుడు పోరాటం చేసిన ఘటన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామ సర్వేనెంబర్ 172లో రవిశంకర్‌ అనే వృద్ధుడికి చెందిన 14 గుంటల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టించి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరుల పేరు మీదకి మార్చారని జిన్నారం తహశీల్దార్ కార్యాలయం ముందు కూర్చుని వృద్ధుడు నిరసన తెలిపాడు. తన భూమికి సంబంధించిన పక్కా పత్రాలు ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది వేరే వారి పేరు మీదకు భూమిని రాశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

వృద్ధాప్యంలో తన పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న రవిశంకర్ తన భూమిని తన పేరుపైన మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని మండిపడ్డారు. తన భూమి కోసం అమెరికా నుండి ఇండియాకి వచ్చి ఆరునెలలు నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన వృద్ధుడు రవిశంకర్, దిక్కుతోచని పరిస్థితిలో న్యాయం చేయాలని జిన్నారం MRO కార్యాలయం ముందు నిరసనకు దిగాడు. నెలరోజుల్లో అమెరికాకు వెళ్ళాలని, ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టు తిరిగిన తన భూమి సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు ఆ వృద్ధుడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>