మనీలాండరింగ్.. MLA ఆరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో అవకతవకలపై నోటీసులు అందజేసింది. సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్ల నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారన్న ఆరోపణలపై విచారించేందుకు  ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులతో పేర్కొంది. అయితే ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది.  రూ.173.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>