భారీ జనసందోహం.. వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (Khairatabad Maha Ganapathi Shobha Yatra) అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. భారీ భక్త జన సందోహం నడుమ మహా గణపతి గంగమ్మ ఒడికి బయలేరారు. ఖైరతాబాద్ నుంచి అశేష భక్త జన వాహిని నడుమ గణపయ్య ముందుకు కదులుతున్నారు. టెలిఫోన్ భవన్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడు చేరుకున్నాడు. ఎక్కడా ఆగకుండా శోభాయాత్ర నిర్విరామంగా సాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగనుంది.

ట్యాంక్ బండ్  వద్దకు గణేష్ నిమజ్జనానికి 20 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.100 హైరైజ్ కెమెరాలతో విగ్రహాల లెక్కింపు చేపట్టనున్నారు. 8,142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటూన్లు,  4 RAF, 2 CRPF కంపెనీలతో కేంద్ర బలగాల మోహరించాయి. నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయగా.. 26 షీ-టీమ్స్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. మహాగణపతి (Khairatabad Maha Ganapathi) శోభాయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసింది.

Also Read : రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. ఈ ఏడాది ఎంతంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>