కలం, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌పై సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఉత్తర దినాగ్‌పూర్‌లో సోమవారం పోలీసులు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై తాజాగా సీఎం సువేందు అధికారి స్పందించారు. పోలీసులు తమపై దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసే హక్కు కలిగి ఉంటారని ఆయన సమర్థించారు. ఒక 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ రాయ్‌గా గుర్తించిన నిందితుడు గౌరీ గ్రామ్ పంచాయతీ సమీపంలో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని రాయ్‌గంజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు నిందితుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Also Read : షేక్ హసీనా కీలక నిర్ణయం.. కేంద్రానికి దరఖాస్తు!
Follow Us On: Youtube

