epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రియాంకాగాంధీ భర్తపై ఈడీ ఛార్జిషీట్

కలం డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) పై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. లండన్‌కు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో వాద్రాకు సంబంధం ఉన్నట్లు ఈడీ పేర్కొన్నది. ఈ కేసులో వాద్రాను ఈడీ తొలిసారి నిందితుడిగా పేర్కొన్నది. ఈ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకునే అంశంపై డిసెంబరు 6న జరిగే విచారణలో నిర్ణయం తీసుకోనున్నది. వాద్రాతో పాటు సంజయ్ భండారీ, సుమిత్ ఛద్దా, సంజీవ్ కపూర్, అనిరుధ్ వాధ్వా తదితర మొత్తం తొమ్మిది మందిని ఈ చార్జిషీట్‌లో నిందితులుగా ఈడీ పేర్కొన్నది. శాంటెక్ ఇంటర్నేషనల్, ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్, షామ్లాన్ గ్రోస్ ఇంక్ తదితర సంస్థలు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి.

రాబర్ట్ వాద్రా సూచనల మేరకే సంజయ్ భండారీ(Sanjay Bhandari) లండన్‌లోని బ్రియాన్‌స్టన్ స్క్వేర్ దగ్గర ఒక ప్రాపర్టీని కొనుగోలు చేశారని, ఇందుకు అవసరమైన మరమ్మత్తులకు కూడా వాద్రాయే(Robert Vadra) డబ్బులు సమకూర్చారని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మొత్తం ఆర్థిక వనరులు రాబర్ట్ వాద్రాకు సంబంధించినవేనని పేర్కొన్నది. గతంలోనే ఇలాంటి ఆరోపణలు రావడంతో స్పందించిన రాబర్ట్ వాద్రా… ఇలాంటి వివాదాలతో నన్ను రాజకీయంగా వేధిస్తున్నారు.. లండన్‌లో ప్రత్యక్షంగాగానీ.. పరోక్షంగాగానీ నాకు ఎలాంటి ప్రాపర్టీ లేదు.. అని స్పష్టం చేశారు.

మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈడీ జూలై నెలలో ఈడీ విచారణకు పిలిచి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అక్టోబరులో రెండుసార్లు విచారణకు పిలిచినా తొలిసారి అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఆ తర్వాత రెండోసారి కోర్టు అనుమతితో విదేశీ టూర్‌లో ఉన్నారు. సంజయ్ భండారీ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఇండియా నుంచి 2016లో లండన్ వెళ్ళిపోయారు. పలు ఆర్థిక నేరాల్లో ఢిల్లీ హైకోర్టు ఆయనను ‘ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్’గా ఇటీవల ప్రకటించింది. ఒక కేసులో లండన్ కోర్టు ఆయనకు రిలీఫ్ ఇస్తే దాన్ని అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికీ అనుమతి లభించలేదు. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఫస్ట్ టైమ్ రాబర్ట్ వాద్రా పేరును పేర్కొనడంతో వచ్చే నెల 6న రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగే విచారణ ఆసక్తికరంగా మారింది.

Read Also: ఉపాసనకు లేడీ డాక్టర్స్ కౌంటర్.. అసలేం జరిగింది..!

Follow Us on : ShareChat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>