కలం డెస్క్ : కొత్త సినిమాల పైరసీ వ్యవహారంలో ‘ఐ బొమ్మ(ibomma)’ నిర్వాహకుడిని అరెస్టు చేసిన కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతున్నది. పెద్దమొత్తంలో విదేశీ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు సమకూర్చుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడంతో ఈడీ దర్యాప్తు అనివార్యం కానున్నది. ప్రతి నెలా క్రమం తప్పకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా ‘ఐ బొమ్మ’ రవి బ్యాంకు ఎన్ఆర్ఐ అకౌంట్‌కు ఎక్కువ మొత్తంలోనే నిధులు సమకూరుతున్న వ్యవహారాన్ని పసిగట్టిన ఈడీ… మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు చేయాలనుకుంటున్నది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా నగర పోలీసు కమిషనర్ సజ్జనార్(Sajjanar)కు ఈడీ లెటర్ రాసింది. పూర్తి వివరాలు అందిన తర్వాత వాటిని పరిశీలించి ఈసీఐఆర్ (ఎఫ్ఐఆర్ లాంటిది) నమోదు చేసి ‘ఐ బొమ్మ(ibomma)’ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేయనున్నది. ప్రస్తుతానికి రవి బ్యాంకు ఖాతాలోని మూడున్నర కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈడీ ఎంట్రీ అయిన తర్వాత దర్యాప్తు ఏ మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: తిరుమల వెళ్లబోయే భక్తులకు గుడ్‌న్యూస్
Follow Us on: Youtube

