epaper
Tuesday, November 18, 2025
epaper

తిరుమల వెళ్లబోయే భక్తులకు గుడ్‌న్యూస్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలకు సంబంధించి టీటీడీ(TTD) కీలక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్‌ 30న ఉదయం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం పది రోజుల పాటు భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 182 గంటలపాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని… ఇందులో 164 గంటలు పూర్తిగా సాధారణ భక్తులకే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.

వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున విస్తృతంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ పాలకమండలి వివరించింది. క్యూ లైన్లు, జనసందోహం నియంత్రణ, తాగునీరు, హెల్త్ క్యాంపులు, లడ్డూ ప్రసాదం పంపిణీ వంటి ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు సౌకర్యంగా దర్శనాలు పూర్తిచేసుకునేలా అదనపు సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం భారీగా భక్తులు తిరుమలకు వస్తారు. అయితే ఈసారి సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల మరింత మంది దర్శన భాగ్యం పొందుతారని టీటీడీ(TTD) భావిస్తోంది. దర్శనాల వ్యవహారంలో పారదర్శకత, నియంత్రణ, వేగం పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈవో సూచించారు. టీటీడీ ప్రకటించిన ఈ నిర్ణయాలతో వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమల భక్తులకు మరింత సౌలభ్యం కలుగనుంది.

Read Also: జక్కన్నకి జలకిచ్చిన ‘వానరసేన’

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>