జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికకు నామినేషన్ వేయాలనుకునేవారికి ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం మిగిలిపోయిన వారి నుంచి నామినేషన్లను బుధవారం కూడా స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం(EC) అనుమతిచ్చింది. నామినేషన్లు వేయడానికి మంగళవారం భారీ సంఖ్యలో అభ్యర్థులు షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. దీంతో వారి దగ్గర నుంచి నామినేషన్లు స్వీకరించడానికి ఈసీ ఓకే చెప్పింది.
ఇందులో భాగంగానే మంగళవారం అర్థరాత్రి వరకు కూడా నామినేషన్లను స్వీకరించారు. అర్ధరాత్రి గడుస్తున్నా నామినేషన్ దాఖలు చేసేందుకు అనేక మంది అభ్యర్థులు వేచి చూస్తుండటంతో, ఈరోజు కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి ఈసీ అనుమించింది. అయితే జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలు చేయడానికి మంగళవారంతో గడువు ముగిసింది. చివరి ఒక్కరోజులోనే మొత్తం 189 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం దాఖలైన నామినేషన్ల సంఖ్య 316కు చేరింది.
Read Also: రాష్ట్రపతి ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం..

