కలం మెదక్ బ్యూరో: సంతోషంగా ఉండడానికి సకల సౌకర్యాలు, డబ్బులు, హోదా అవసరం లేదు. చేసే పనిలోనే ఆనందం వెతుక్కుంటూ చుట్టు పక్కల వారితో కలిసిమెలిసి ఉండటమే నిజమైన జీవితం అని చేసి చూపించారు మెదక్ జిల్లా ఉపాధి హామీ కూలీలు. నర్సాపూర్ (Narsapur) మండలం నత్నాయపల్లి గ్రామంలో ఉపాధిహామీ పని విరామ సమయంలో కూలీల ఆటవిడుపు పెళ్లి వేడుకలు చేశారు. పనికి వెళ్లిన దంపతులకు వినూత్నంగా పెళ్లి వేడుక నిర్వహించారు తోటి కూలీలు. పని చేసే ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వివిధ రకాలు పూలతో దండలుగా, పచ్చటి ఆకులను అక్షింతలు, ఒడిబియ్యంగా ఉపయోగించి పెళ్లి వేడుక (Nature Themed Wedding) నిర్వహించారు.

