కలం, ఖమ్మం బ్యూరో: మెరుగైన వైద్య సౌకర్యాలు, నూతన పరికరాలు అందుబాటులో ఉంటే గ్రామీణ డాక్టర్స్ సైతం అరుదైన చికిత్సలు చేయగలరు. కష్టసాధ్యమైన ఆపరేషన్లను సైతం సులభంగా చేయొచ్చని నిరూపించారు ఈ డాక్టర్స్. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఈఎన్‌టీ బృందం అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన నిర్మల్ అనే మహిళకు ప్రమాదవశాత్తు చెవి భాగం తెగిపోయింది. ఈ కఠిన పరిస్థితిని సవాలుగా తీసుకున్న డాక్టర్లు శుక్రవారం ఆపరేషన్ చేసి చెవి భాగం అమర్చారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ శాంసన్ వైద్య బృందం కీలకంగా పనిచేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ ఆపరేషన్ రుజువు చేయడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అమీన్‌పూర్‌లో బదిలీ డ్రామా.. 48 గంటల్లో ట్విస్ట్‌లు
Follow Us On: Sharechat

