కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ లో చేరేందుకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 20న కారెక్కేందుకు అంతా సిద్ధమయింది. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సమక్షంలో కారు పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ లో తనకు సరైన గౌరవం లేదని జీవన్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటించడంతో హస్తం పార్టీ నేతలు, మంత్రులు ఆయనతో పలు సార్లు చర్చలు జరిపారు. అయినా, అలక మానని మాజీ మంత్రి (Jeevan Reddy) హస్తానికి గుడ్ బై చెప్పేశారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల కేటీఆర్ (KTR) స్వయంగా వెళ్లి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. దీంతో శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో భేటీ అయి పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి చర్చించారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో చేరిక తేదీని ఫిక్స్ చేశారు.
Read Also: రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు?: జూపల్లి
Follow Us On: Pinterest

