కలం, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి (Duvvada Madhuri) జంట గురించి తెలియని వారు ఉండరేమో. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద అంశంలో వీరు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి కొంతకాలానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ దంపతులు తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అక్కడ భారీగా విదేశీ మద్యం, హుక్కా బాటిళ్లు దొరికినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని ఓ ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి (Duvvada Madhuri) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడ పార్టీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తం 10 విదేశీ స్కాచ్ బాటిళ్లు, 5 హుక్కా బాటిళ్లను ఎస్ వోటీ పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ పుట్టినరోజు వేడుక దువ్వాడ మాధురిదా? లేదంటే స్నేహితుల బర్త్ డే పార్టీకి వీళ్లు వెళ్లారా? అన్న విషయంపై క్లారిటీ లేదు.
Read Also: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్
Follow Us On: Instagram


