కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియా (Social Media) కారణంగా నటీనటుల ఫొటోలు దుర్వినియోగమవుతున్నాయి. బాలీవుడ్ నటీనటులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఏఐ లాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నటుల భద్రతకు రక్షణ లేకుండాపోతోంది. డీప్ ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ధాటికి బెంబేలెత్తిపోతున్న సినీ నటులు కోర్టుల ద్వారా తమ హక్కులు, భద్రతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున కోర్టు నుంచి రక్షణ పొందారు. ప్రస్తుతం పవన్(Pawan Kalyan) కూడా అదే తరహాలో కోర్టుకు వెళ్లారు.
వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తన ఫోటోలు వీడియోలు దుర్వినియోగమవుతున్నాయని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇ-కామర్స్ సైట్‌లలోని అనేక సంస్థలు అనుమతి లేకుండా ఫొటోలు వాడుతున్నారని పవన్ ఆరోపించారు. కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్ వాదనలు వినిపించారు. ఈ మేరకు వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా మధ్యవర్తులను ఆదేశించారు.
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యహరిస్తున్నారు పవన్. అయితే సినిమాల్లో అదరిపొయే లుక్‌తో కనిపించే పవన్ , రియల్ లైఫ్‌లో సాధారణంగా కనిపించడంతో ఆయన లుక్స్‌పై విమర్శలొచ్చాయి. అలాగే ఆయన తరుచుగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
Read Also: సిటిజెన్‌షిప్ వదులుకున్న తొమ్మిది లక్షల మంది..
Follow Us On: Youtube


