మణుగూరు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ తనిఖీలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, ఆయుధ సామగ్రి (తుపాకులు), స్టేషన్ పరిసరాల నిర్వహణను పరిశీలించారు. అనంతరం పెండింగ్‌ కేసులు, పురోగతి, దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశాలపై మణుగూరు సీఐ నాగబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో, విధుల నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పెండింగ్‌ కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో మెరుగైన సేవలు అందించాలన్నారు. అలాగే, స్టేషన్ సిబ్బంది ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

Read Also: తెలంగాణను వణికిస్తున్న ఎబోలా.. అసలేంటీ వైరస్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>