కలం, మెదక్ బ్యూరో: విధులు నిర్వహిస్తున్న ఓ డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో మేడ్చల్ డిపోకు చెందిన డ్రైవర్ తిరుమలేష్ మద్యం సేవించి బస్సు నడిపాడు. మేడ్చల్ నుండి నర్సాపూర్ వస్తున్న ఈ బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు బస్సును నిలిపివేసి నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో డ్రైవర్ తిరుమలేష్ 70 శాతం మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే స్పందించిన నర్సాపూర్ ఆర్టీసీ అధికారులు నర్సాపూర్ బస్టాండ్‌లో బస్సును నిలిపివేసి.. డ్రైవర్‌ను మందలించారు.
Read Also: కేరళలో హామీలు నెరవేర్చేందుకు కష్టపడతాం: ప్రియాంకా గాంధీ
Follow Us On: Instagram

