కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా వద్ద ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ల్యాండ్ అవుతారు. నేవల్ బేస్‌లో నిర్వహించే విందులో పాల్గొని రాత్రి ఇక్కడే బస చేస్తారు. అలాగే ఈ నెల 18 నుంచి విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో పాల్గొంటారు. ద్రౌపది ముర్ముతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఏపీలో పర్యటించనున్నారు.
గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి (Droupadi Murmu) స్వాగతం పలికేందుకు విశాఖ వెళ్లనున్నారు. ఆర్కేబీచ్ ఐఎఫ్ఆర్ సందర్భంగా నౌకాదళం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read Also: తొర్రూరులో హై టెన్షన్.. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు
Follow Us On: Sharechat


