Mobile Popup Ad
Mobile Popup Ad

సింగపూర్ దేశాధ్యక్షుడినే బురిడీ కొట్టించిన భారత సంతతి వ్యక్తి.. చివరకు!

కలం, వెబ్ డెస్క్: సింగపూర్‌లో జైలు అధికారిగా నటిస్తూ దేశాధ్యక్షుడిని, ఇతర ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించాడు ఓ భారత సంతత వ్యక్తి. ఇందుకుగాను 25 ఏళ్ల ప్రకాశ్ పరమశివంకు తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. గతంలో తాను ఎదుర్కొన్న నేరారోపణల నుంచి బయటపడాలని భావించాడు. తన తల్లి ఫోన్‌ను ఉపయోగించి ఏకంగా సింగపూర్ (Singapore) అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, పార్లమెంట్ సెక్రటేరియట్, ఇతర ప్రముఖులకు ఇమెయిల్స్ పంపాడు. తాను ఒక ప్రభుత్వ అధికారిని అని నమ్మించి, తన పాత కేసులను పునఃసమీక్షించాలని కోరుతూ మోసానికి పాల్పడ్డాడు.

ఇతని మోసం కేవలం ఈమెయిల్స్‌తోనే (Email) ఆగలేదు. గత ఏడాది జూలైలో బెయిల్‌పై ఉన్న సమయంలో, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవడానికి ఓ నకిలీ మెడికల్ సర్టిఫికేట్‌ను (MC) సృష్టించాడు. అసలైన సర్టిఫికేట్‌ను ఎడిట్ చేసి, తనకు అనారోగ్యంగా ఉందని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రకాశ్ వరుసగా ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటంతో సింగపూర్ న్యాయస్థానం నేరస్తుడిగా పరిగణించి కఠినమైన శిక్షను ఖరారు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>