epaper
Wednesday, February 18, 2026
epaper

నిశాంక అజేయ​ సెంచరీ.. ఆస్ట్రేలియాకు ‘సూపర్’​ గండం

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​ ప్రారంభానికి ముందు టైటిల్​ ఫేవరెట్లలో ఆస్ట్రేలియా ఒకటి. కానీ, లీగ్​ దశలో ఆ జట్టు పోరాటాన్ని చూస్తే కనీసం సూపర్​–8కి అయినా చేరుతుందా అనిపిస్తోంది. కారణం.. చిన్న జట్టయిన జింబాబ్బే చేతిలో ఖంగుతిన్న ఆసిస్​ సోమవారం ఆతిథ్య లంక చేతిలో పరాజయం మూటగట్టుకుంది (Pathum Nissanka). పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన ఆస్ట్రేలియా సరిగ్గా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. ఓపెనర్లు ట్రావిస్​ హెడ్​(56; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్​లు), మిచెల్​ మార్ష్​(54; 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్​లు) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఒక దశలో వికెట్​ నష్టపోకుండా 8 ఓవర్లలోనే 104 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత తడబడింది. మిడిలార్డర్​లో జోష్​ ఇంగ్లిస్​(27), గ్లెన్​ మాక్స్​వెల్​(22) మినహా మిగిలినవాళ్లంతా సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు.

ఛేదనలో ఓపెనర్​ కుశాల్​ పెరీరా(1) త్వరగానే పెవిలియన్​ చేరినప్పటికీ మరో ఓపెనర్​ నిశాంక(100 నాటౌట్​; 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్​లు), (Pathum Nissanka) కుశాల్​ మెండిస్​(51; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్​)తో కలసి రెండో వికెట్​కు 97 పరుగులు జోడించాడు. అనంతరం పవన్​ రత్నాయకే(28 నాటౌట్​; 15 బంతుల్లో 6 ఫోర్లు) తోడుగా జట్టును విజయం వైపు నడిపించాడు. ఈ క్రమంలో టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంక కోల్పోయిన రెండు వికెట్లూ స్టొయినిస్​కు దక్కాయి. నిశాంక ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’గా ఎంపికయ్యాడు.

టోర్నీలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్​లు ఆడిన ఆసిస్ 1 గెలుపు, 2 పరాజయాలతో కేవలం 2 పాయింట్లు మాత్రమే సంపాదించింది. సూపర్​8కు ఆసిస్​ చేరడం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>