కలం, వెబ్ డెస్క్: చలి తీవ్రత తగ్గినా మంచు తగ్గడం లేదు. గత వారం రోజులుగా తెలంగాణలో దట్టమైన పొగమంచు నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా హైవేలపై (Highways) పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 10 మీటర్ల కంటే తక్కువకు విజిబిలిటీ పడిపోయింది. వాహనాలు కనిపించక డ్రైవర్లు భయపడిపోతున్నారు. కొన్ని చోట్ల మంచు కారణంగా రోడ్లపై ఒకదానికొకటి వాహనాలు ఢీకొంటున్నాయి. సోమవారం ఉదయం పలు హైవేలపై దట్టమైన మంచు ఉండటంతో రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. పొగమంచు (Fog)తో పాటు ఎయిర్ క్వాలిటీ కూడా పడిపోయింది. వీలైనంత వరకు తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దంటున్నారు అధికారులు.
అలాగే శంషాబాద్‌తో దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, వారణాసి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి.


