కలం వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌పై మరోసారి టారిఫ్(Tariffs)ల పెంపు హెచ్చరిక చేశారు. రష్యా నుంచి చమురు(Russian Oil) కొనుగోళ్లు కొనసాగిస్తే టారిఫ్‌లు పెంచుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ట్రంప్ సంతోషంగా లేడన్న విషయం తెలుసని, తనను సంతోషపెట్టడం ముఖ్యమని మోడీకి అర్థమైందని చెప్పారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. “ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి. మంచి స్నేహితుడు. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. వాళ్లు వ్యాపారం చేస్తున్నారు, మనం వాళ్లపై టారిఫ్‌లు చాలా త్వరగా పెంచేయొచ్చు” అని వ్యాఖ్యానించారు.
గతేడాది ట్రంప్ భారత్‌పై 25 శాతం రెసిప్రొకల్ టారిఫ్‌లు, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు మరో 25 శాతం పెనాల్టీ విధించారు. కొన్ని రకాలపై మొత్తం 50 శాతం టారిఫ్‌లు అయ్యాయి. దీంతో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. మోడీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన కొద్ది వారాల తర్వాత తాజాగా టారిఫ్‌లపై వ్యాఖ్యలు చేశారు. గత సంభాషణలో ఇద్దరు నేతలు వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవాలని కోరుకున్నారు. అదే రోజు రెండు దేశాల అధికారులు టారిఫ్‌ల సమస్య పరిష్కారానికి కొత్త చర్చలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం భారత్ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ కొత్త టారిఫ్‌లు విధిస్తామని బెదిరించారు. వైట్ హౌస్‌లో రైతులతో మాట్లాడుతూ ఇండియా, చైనా, థాయ్‌లాండ్ డంపింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. భారత్, అమెరికా మధ్య టారిఫ్‌ల సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగుతున్నాయి కానీ ఎలాంటి పురోగతి లేదు.


