Mobile Popup Ad
Mobile Popup Ad

సదాశివపేటలో దారుణం.. భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య!

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా సదాశివపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై తానూ ప్రాణాలు తీసుకున్నాడు. సదాశివపేట పట్టణంలోని 7వ వార్డులో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యపై అనుమానంతో భర్త ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, ఇంట్లోని రోకలి బండతో భార్య రాణి (40) తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ​భార్య మరణించిందని నిర్ధారించుకున్న భర్త రాజు (43), తర్వాత కొద్దిసేపటికే తీవ్ర మనోవేదనతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ప్రాథమికంగా అనుమానమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నప్పటికీ, దీని వెనుక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొనడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న సదాశివపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also: ఐదు కీలక హామీలు ప్రకటించిన కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>