ఐదు కీలక హామీలు ప్రకటించిన కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజాసేన ఆవిర్భావ సభలో కవిత పాంచజన్యం పూరించారు. ప్రజలకు ఐదు కీలక హామీలు ఇచ్చారు. తన ప్రసంగంలో కవిత (TRS Chief Kavitha) రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు ఏం చేస్తామో కూడా చెప్పారు. సూటిగా సుత్తిలేకుండా గంట సేపు అనర్గళంగా మాట్లాడారు. ఇంగ్లిష్, ఉర్దూలోనూ ఎక్కడా తడబడకుండా తాను చెప్పదలుచుకున్న విషయాలను చెప్పేశారు. ముందుగా తెలంగాణ ప్రజాసేన ఆవిర్భవించాల్సిన అవసరం ఏమిటో వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే టీఆర్ఎస్ ఆవిర్భవించిందని చెప్పుకొచ్చారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పాలనలో న్యాయం జరగలేదని ఆరోపించారు. ఉద్యమద్రోహులు, సమైక్యవాదులకే పదవులు కట్టబెట్టారని విమర్శించారు.

కవిత (TRS Chief Kavitha) ఇచ్చిన ఐదు హామీలు ఇవే..

1) ఉచిత విద్య
2) ఉచిత వైద్యం
2) రైతును రాజు చేయడం
3) యవతకు ఉపాధి
4) సామాజిక న్యాయం

తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని.. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ ఉచిత విద్య అందిస్తామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ అనే తేడా లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తామన్నారు. వైద్యం కూడా ఏ వ్యాధి అయినా ఏ ఆస్పత్రి అయినా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు విలువు లేకుండా పోయిందని తాము పవర్‌లోకి రాగానే రైతులు తలెత్తుకొని తిరిగేలా చేస్తామని భరోసా ఇచ్చారు. యువత కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా వారు తమ కలలను నిజం చేసుకొనేలా ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం లోపించిందని అందుకే అన్ని వర్గాల వారికి తమ పార్టీలో అవకాశం కల్పిస్తామని.. కింది కులాల వాళ్లకు అధికారానికి దూరమైన కులాలకు న్యాయం చేస్తామన్నారు. ముస్లింలకు కూడా న్యాయం చేస్తామన్నారు.

Read Also: ‘ఆ సారు రారు’.. కేసీఆర్ పై క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>