అందోల్‌లో 2BHK కాలనీవాసుల ఆందోళన

కలం, మెదక్ బ్యూరో : డబుల్ బెడ్ రూమ్స్ కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్- జోగిపేట (Andole – Jogipet) మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. అందోల్ లోని కుమ్మరి గూడెం డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో డ్రైనేజి కనీస నిర్వహణ లేకపోవడంతో మురికి నీళ్ళతో పూర్తిగా నిండి దుర్వాసన వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ, ఇతర సమస్యల గురించి పలు మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోవడంతో విష జ్వరాలు ప్రభాలుతున్నాయని, కాలనీలో ఉండలేని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>