కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌పై అమెరికా (Iran – US War) చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై మరింత తీవ్రమైన దాడులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. యుద్ధ గమనాన్ని వివరిస్తూ ట్రంప్ చేసిన ఈ సంచలన ప్రసంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జరిగిన దాడులతో ఇరాన్ కీలక నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, ఆ దేశం కోలుకోలేని స్థాయిలో నష్టపోయిందని ఆయన తెలిపారు.
ముఖ్యంగా ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం ఈ యుద్ధం వల్ల భారీగా దెబ్బతిన్నాయని, వాటి ఉనికి దాదాపు కనుమరుగైందని ట్రంప్ (Donald Trump) వివరించారు. తన పరిపాలనలో అమెరికా సైన్యం అద్భుతమైన విజయాలు సాధించిందని, దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాటం సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభం వారి అంతర్గత నాయకత్వ వైఫల్యమేనని అభిప్రాయపడుతూ, రానున్న రోజుల్లో జరగబోయే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: తలతిక్క ట్రంప్
Follow Us On : WhatsApp

