Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాలో మరో విషాదం.. ఎన్నారై దంపతులు మృతి

కలం, వెబ్ డెస్క్: అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో ఎన్నారై దంపతులు మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 2:30 గంటల ప్రాంతంలో మద్యం తాగిన ఓ ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్‌లో వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణ కొటికలపూడి, అతని కుటుంబం ఘోరమైన ప్రమాదానికి గురయ్యారు. కృష్ణ కిశోర్, అతని భార్య ఆశ (NRI Couple) తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. వారి మృతదేహాలను మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఉంచినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిది ఏపీలోని పాలకొల్లు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల విదేశాల్లో ఇండియన్స్ (Indians) ఆకస్మికంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. వరుస ఘటనలు జరుగుతుండటంతో భారతీయుల్లో భయం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>