మార్కాపురం విషాదం.. డీఎన్ఏ ప‌రీక్ష‌తోనే మృతుల గుర్తింపు

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలోని మార్కాపురం (Markapuram)లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వీరి మృత‌దేహాలు మార్కాపురం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి మార్చురీలో ఉన్నాయి. మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా కాలిపోయాయి. దీంతో కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించ‌డం ఆల‌స్యం అవుతోంది. నేడు డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మృత‌దేహాల‌ను బాధిత కుటుంబాల‌కు అప్ప‌గించ‌నున్నారు. మ‌రోవైపు ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ 28 మందికి చికిత్స కొన‌సాగుతోంది. ఒంగోలులో 16 మందికి, మార్కాపురంలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>