కలం, వెబ్ డెస్క్: ట్రంప్.. ఫుల్ ఖుషీలో ఉన్నారు! అమెరికా స్టాక్ మార్కెట్లు తాను అనుకున్నట్లు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండటంతో ఆయన ఆనందానికి హద్దు అదుపు లేకుండాపోతున్నది. టారిఫ్‌లతో భారత్ సహా పలు దేశాలను ఇబ్బందులు పెడ్తున్న ట్రంప్ (Donald Trump).. ఇప్పుడు వెనెజువెలాను తన హస్తగతం చేసుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు మదురోను నిర్బంధించిన అమెరికా ప్రెసిడెంట్.. త్వరలో గ్రీన్ ల్యాండ్‌ని తమలో కలుపుకుంటామని చెప్పకనే చెప్తున్నారు. దీన్ని డెన్మార్క్ సహా అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నా ట్రంప్ మాత్రం ఆగడం లేదు. టారిఫ్‌ల ఎఫెక్ట్‌కు తోడు వెనెజువెలాలో అమెరికా ఆంక్షల పాలన రావడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు జెట్ స్పీడ్‌ను అందుకున్నాయి. మరో ఆల్‌టైమ్ రికార్డును చేరుకున్నాయి.
డౌజోన్స్, నాస్డాక్ వంటి స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌ను ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి రీచ్ అయ్యాయి. దీంతో ఖుషీలో ఉన్న ట్రంప్ (Donald Trump).. ‘‘థ్యాంక్యూ మిస్టర్ టారిఫ్” అంటూ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తాను విధిస్తున్న టారిఫ్‌లకు సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పాలని ప్రార్థిస్తున్నానని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇక తిరుగే ఉండదని అందులో రాసుకొచ్చారు. ట్రంప్ ఉత్సాహాన్ని చూసి ఆయన అభిమానులు.. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్” బదులు ‘‘మిస్టర్ టారిఫ్”అని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Read Also: ట్రంప్‌తో CM రేవంత్ భేటీ? దావోస్ వేదికగా సన్నాహాలు!
Follow Us On: Twitter


