కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ లో హీరోయిన్ రెజీనా (Regina Cassandra) సందడి చేశారు. కరీంనగర్ కళాభారతిలో డెమోక్రటిక్ సంఘ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో (Pamela Satpathy) పాటు డెమొక్రటిక్ సంఘ కో ఫౌండర్, సినీనటి రెజీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు తమ ఆత్మ గౌరవం కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. తాను సుమారుగా 10ఏళ్ల నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్నానని.. మహిళా పాలకులు ఉన్నచోట ప్రజా సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ సాయంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అభినందనీయమన్నారు. తమ్ముడు, భర్త, తండ్రి, కొడుకు చెప్పినట్లు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మహిళా వార్డు సభ్యులకు కలెక్టర్ సూచించారు.
గ్రామీణ మహిళల్లో అసాధారణ శక్తి..
హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) మాట్లాడుతూ గ్రామీణ మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని. దానిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మహిళల ఆలోచనలు విన్నామని ఆమె వివరించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 25 మంది మహిళలకు ప్రోత్సాహం అందించగా 18 మంది నామినేషన్ దాఖలు వేస్తే.. 11 మంది వార్డు సభ్యులుగా గెలిచారన్నారు.
Read Also: రవితేజ కొత్త మూవీ ట్రైలర్.. ఎలా ఉందంటే..?
Follow Us On: Youtube


