కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నిన్న భోపాల్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగిన ‘పెద్ది’ మ్యూజికల్ ఈవెంట్‌లో ప్రముఖ భారత క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) ఫుట్‌బాల్ ప్లేయర్ అంటూ.. పొరపాటున తప్పుగా పలకడంతో అభిమానులలో చర్చ మొదలైంది. అయితే వెంటనే స్పందించిన రామ్ చరణ్, అది పూర్తిగా అనుకోకుండా జరిగిన తప్పిదమని స్పష్టం చేశారు.
“కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను. ఆ ఉత్సాహం, అభిమానుల సందడి మధ్యలో పొరపాటు జరిగింది. బుమ్రా జీకి క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే బుమ్రాపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ఆటకు తాను పెద్ద అభిమానినని తెలిపారు. భారత జట్టుకు బుమ్రా అందిస్తున్న సేవలను ప్రశంసించిన రామ్ చరణ్ (Ram Charan), “మీరు ప్రతి భారతీయుడికి గర్వకారణం. మీ బౌలింగ్‌తో ఎప్పుడూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో పెడతారు” అని కొనియాడారు. రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
Read Also: హీట్ వేవ్ ఎఫెక్ట్: ఆల్ టైమ్ హైకి విద్యుత్ వినియోగం!
Follow Us On: X (Twitter)

