ఓటమిపై తొలిసారి స్పందించిన స్టాలిన్

కలం, నేషనల్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే (DMK)  కూటమి ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, ఆ పార్టీ అధినేత స్టాలిన్ (Stalin) భావోద్వేగంగా స్పందించారు. డీఎంకే 6 సార్లు అధికారంలో ఉండి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను చూసిందని.. తమ పార్టీ చూడని విజయం లేదని.. ఎదుర్కోని ఓటమి లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును తాము శిరసావహిస్తున్నామని ఆయన ప్రకటించారు.

ఇప్పటి వరకు ఆదర్శవంతమైన పాలక పక్షంగా బాధ్యతలు నిర్వహించామని.. ఇకపై అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలిచే బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని స్టాలిన్ (Stalin) ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి దాదాపు 1.54 కోట్ల మంది ఓటర్లు మద్దతు తెలిపారని.. గెలిచిన పార్టీకి తమకు మధ్య తేడా కేవలం 3.52 శాతమేనని గుర్తు చేశారు. ఓటమికి కుంగిపోకుండా.. కరుణానిధి వారసులుగా ఆశయ సాధన కోసం అలుపెరగని పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Read Also: టీవీకే విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు.. కేసీ వేణుగోపాల్ ఏమన్నారంటే?

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>