కలం, స్పోర్ట్స్ : హోంగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్ (DC vs CSK) లో ఢిల్లీ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఆల్‌రౌండర్లు, బౌలర్లు జట్టును ఆదుకుని గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. వారిలో సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 40 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. స్టబ్స్ కూడా తనదైన ఆటతీరుతో 38 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చెన్నై బౌలర్లను చూసుకుంటే నూర్ అహ్మద్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లకు 22 పరుగులిచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిలలాడారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ (DC vs CSK) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక (19) కాసేపు మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (12), నితీష్ రాణా (15), కరుణ్ నాయర్ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అక్షర్ పటేల్ కేవలం 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ జంట ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. స్టబ్స్ 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నుముకగా నిలిచాడు.
మరోవైపు సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 4 భారీ సిక్సర్లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లలో అశుతోష్ శర్మ 5 బంతుల్లోనే 2 సిక్సర్లతో 14 పరుగులు పిండుకోవడంతో ఢిల్లీ స్కోరు 150 మార్కును దాటింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. అకీల్ హొస్సేన్, ముకేశ్ చౌదరి, గుర్జపనీత్ సింగ్, జమీ ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. 156 పరుగుల లక్ష్యంతో చెన్నై ఇప్పుడు బరిలోకి దిగనుంది.
Read Also: మే 2026లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భారీ రాబడినిచ్చే టాప్ ఎస్‌ఐపీలు ఇవే!
Follow Us On : WhatsApp

