కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) పేరు ఖరారయింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర శాసన సభా పక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. శనివారం సాయంత్రం విధాన సౌదలో జరిగిన సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. బసవేశ్వర బలపరిచారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకేను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే శివకుమార్ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారయినట్లు తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీ (బుధవారం) కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. మరోవైపు కొత్త మంత్రి వర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి.

