మొరాకో గోల్ఫ్ టోర్నీ: జోరు మీదున్న భారత్

కలం, వెబ్ డెస్క్:  మొరాకో వేదికగా జరుగుతున్న ఐజీపీఎల్ మొరాకో రైజింగ్ స్టార్స్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌(Morocco Golf Event)లో భారత యువ సంచలనం కార్తీక్ సింగ్ అదరగొట్టాడు. రెండో రౌండ్‌లో ఒక్క భోగీ కూడా లేకుండా 6 అండర్ 66 స్కోరుతో అద్భుత ప్రదర్శన ఇచ్చి, ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు స్పెయిన్‌కు చెందిన అగస్తీ మదాలెనా 12 అండర్ స్కోరుతో, నాలుగు షాట్ల ఆధిక్యంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కార్తీక్ సింగ్ మొత్తం 7 అండర్ స్కోరుతో థాయ్‌లాండ్ ఆటగాళ్లు తనాపత్ పిచాయికూల్, రుంచనపాంగ్‌లతో కలిసి ఐదో స్థానాన్ని పంచుకున్నాడు.

మొదటి రోజు ఆట ముగిసేసరికి టాప్-10లో ఉన్న భారత ఆటగాళ్లు రాఘవ్ చుగ్, సయ్యద్ సాకిబ్ అహ్మద్ రెండో రోజు 12వ స్థానానికి పడిపోయారు. కాగా, ఒలింపియన్ ఉదయన్ మానే, సుధీర్ శర్మతో పాటు కరణ్‌దీప్ కోచ్చర్ కట్ అందుకోవడంలో విఫలమయ్యారు. భారత్ నుంచి కార్తీక్ సింగ్‌తో పాటు మొత్తం 10 మంది ప్లేయర్లు తదుపరి రౌండ్లకు అర్హత సాధించారు. ఇది తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఆట అని, ఎలాంటి తప్పులు లేకుండా పర్‌ఫెక్ట్ రౌండ్ ఆడానని లీడర్ అగస్తీ మదాలెనా సంతోషం వ్యక్తం చేశాడు. వీకెండ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తానని చెప్పాడు. ఆసియా డెవలప్‌మెంట్ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీ (Morocco Golf Event) ముగిసిన తర్వాత, ఇదే వేదికపై ఐజీపీఎల్ భారత్ క్లాసిక్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత ఆటగాళ్ల స్థానాలు:

కార్తీక్ సింగ్: 5వ స్థానం (7 అండర్)

రాఘవ్ చుగ్, సాకిబ్ అహ్మద్: 12వ స్థానం (5 అండర్)

త్రిశూల్ చిన్నప్ప: 25వ స్థానం (4 అండర్)

రషీద్ ఖాన్, అర్జున్ భాటి, సమర్థ్, సచిన్: 36వ స్థానం (2 అండర్)

మిలింద్ సోని, కార్తీక్ శర్మ: 45వ స్థానం (1 అండర్)

Read Also: ఎంపీఎల్ టీ20కి Bhopal Wolves జట్టు ఇదే..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>