2029 ఎన్నికలలో మహిళలకు 33 శాతం సీట్లు.. లోకేశ్ కీలక ప్రతిపాదన

కలం, వెబ్ డెస్క్ : టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (Nara Lokesh) మహిళల రాజకీయ సాధికారతపై కీలక ప్రతిపాదన చేశారు. 2029 ఎన్నికలలో టీడీపీ 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని సూచించారు. మహిళలు కేవలం పథకాల లబ్ధిదారులుగానే కాకుండా, నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. పార్టీ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల రాజకీయాలలో సమతుల్యత, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహంలో మహిళా ప్రాతినిధ్యం కీలక అంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: SIRను సీరియస్‌గా తీసుకోవాలి.. జగన్ కీలక ఆదేశాలు

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>